GDWL: భక్తులు దేవస్థానం వారు కేటాయించిన ప్రాంతంలోనే దీపాలు వెలిగించాలవి ఈవో దీప్తి సూచించింది. తుంగభద్ర నది పుష్కర ఘాట్ వద్ద బుధవారం కార్తీక దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పుట్టిపై పడటంతో అది పూర్తిగా కాలిపోయింది. దగ్ధమైన పుట్టి ఖరీదు సుమారు రూ. 25 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు.