CTR: సదుం మండలం తాటిగుంటపాలెంలో రెండు రోజులుగా ‘నాన్న డైరీ’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. గ్రామంలోని పాత ఇళ్లలో, దళితవాడలోని గుడి, పాఠశాల వద్ద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ.. మధ్య తరగతి కుటుంబ జీవితం నేపథ్యంలో తండ్రి, కుమారుడు మధ్య ఎమోషనల్ సెంటిమెంట్‌తో సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపారు.