కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో బుధవారం ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 27 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీల ద్వారా రూ. 1,59,44,748 ఆదాయం, బంగారం 15 గ్రాములు, వెండి 910గ్రాములు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ లభించాయని ఈఓ చక్రధర్ రావు తెలిపారు.