W.G: భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో నరసాపురం వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ఒక వ్యక్తి నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించాడని సీఐ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడు బుధవారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం చొక్కా ధరించిన వ్యక్తి బంగారం ప్యాకెట్‌ను లాక్కుని పరారైనట్లు సీఐ పేర్కొన్నారు.