CTR: GD నెల్లూరు(M) ఎల్లమ్మరాజు పల్లి వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు బెంగళూరు వైపు నుంచి సత్యవేడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బైకు రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.