కృష్ణా: గుడివాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభావతి గార్డెన్స్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. పురుషులకు ప్రోస్టేట్ గ్రంధి పరీక్ష, మహిళలకు గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకు టెస్ట్, క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో మార్పులను గుర్తించే CA-125 టెస్ట్‌లు చేయనున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఈ పరీక్షలు ఉచితంగ నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షుడు నాగేశ్వరావు తెలిపారు.