WNP: జిల్లా కేంద్రంలో ఈనెల 22న ఏర్వ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదవుల ‘సదర్ సయ్యాట’కు రావాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని నిర్వాహకులు సంతోష్ యాదవ్, సాయిప్రసాద్ యాదవ్ కోరారు. బుధవారం రాత్రి ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాజకీయాలకు తావులేకుండా ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. నాయకుడు మండ్ల దేవన్న నాయుడు పాల్గొన్నారు.