SRPT: కోదాడ లాకప్ డెత్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల ప్రధాన కూడలిలో మోకాళ్లపై బుధవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. నల్ల కండువాలు ధరించి చిలుకూరు ఎస్సై, కోదాడ సీఐల అత్యుత్సాహం వల్ల కర్ల రాజేష్ మృతి చెందాడని నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు చిలుకూరు ఎస్సై, కోదాడ సీఐలు పూర్తిగా బాధ్యత వహించాలన్నారు.