NDL: నంద్యాల పట్టణం భైరమల్ వీధిలో ఉన్న బసవేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం కార్తీక అమావాస్యను పురస్కరించుకొని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.