NRPT: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ‘మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి’ పేరిట ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్య క్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.