KMR: నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆవరణలోని ఆయుష్ మందిరంలో నేడు ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం ఉంటుందని మండల ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప పేర్కొన్నారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యోగా శిక్షకులతో యోగాసనాలు ఉంటాయన్నారు. మండల ప్రజలు wఈ యోగా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.