MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సారయ్య మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఆశయాలే రేవంత్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధారమని ఆయన పేర్కొన్నారు.