NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఇవాళ ఉదయం కార్తీక మాసం సందర్భంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య కార్తీక దీపారాధన ఘనంగా జరిగింది. అర్చకులు గణేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దీప స్తంభం వద్ద ముగ్గులు వేసి, మట్టి ప్రమిదలతో దీపారాధన చేసి, ఆకాశ దీపానికి పూజ చేసి, కొబ్బరికాయలు కొట్టి మహిళా భక్తులు దీపోత్సవం నిర్వహించారు.