విజయనగరం ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలలో జాప్ (జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్) 33వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యరావు, సమాచార శాఖ ఏడి గోవిందరావు హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా జాప్ ఆధ్వర్యంలో అందుల విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు.