తన పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ అయినట్లు నటి శ్రియా శరణ్ తెలిపింది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ‘ఈ వాట్సాప్ ఎవరిదో నాకు తెలియదు. ఈ నెంబర్ నాది కాదు. ఇలాంటి వారితో చాట్ చేసి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. ఈ వ్యక్తి నాకు సంబంధించిన వారికి మెసేజ్లు చేస్తున్నాడు. అందరూ జాగ్రతంగా ఉండండి’ అని పేర్కొంది.