MDCL: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం రూ. 11 కోట్లతో చెరువుల సుందరీ కరణ జరగనుంది. ఈ మెరకు ఇప్పటికే పనులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సుద్దకుంట చెరువు, చెంగిచెర్ల చింతలకుంట చెరువులను సుందరీకరించేందుకు ప్రభుత్వం అనుమతించడంతో స్థానిక అధికారులు పనులను ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు.