AP: విజయవాడ కోర్టులో పోలీసులు 28 మంది మావోయిస్టులను హాజరుపర్చారు. వైద్యులు మావోయిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పోలీసులు వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నిన్న 50 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం అరెస్టయిన మావోయిస్టులను పోలీసు అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.