HYDలో ఈ సారి దీపావళి నాడు ఏకంగా AQI 410కి పైగా నమోదయింది. దీంతో ప్రమాదపు డేంజర్ బెల్ రెడ్ సిగ్నల్ మోగింది. దీనిని అంచనా వేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహానగర పొల్యూషన్ పెనుముప్పుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కానీ, గ్రౌండ్ లెవెల్లో పీసీబీ చర్యలు అంతగా ఉండటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.