ప్రకాశం: చీమకుర్తి తహసీల్దార్ ఆర్. బ్రహ్మయ్య ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ ద్వారా స్నేహితులకు, కమ్యూనిటీ గ్రూపుల్లోకి ఒక APK ఫైల్ లింక్‌ను పంపించారు. తహసీల్దార్ వెంటనే వేరే ఫోన్ ద్వారా సన్నిహితులకు సందేశం పంపి అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.