NZB: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బాధితుడు బత్తుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం ఇండియన్ హోమ్ పైప్స్ కంపెనీ ద్వారా మిషన్ భగీరథకు సంబంధించిన సుమారు రూ. 4 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశామన్నారు.