రాజ్కోట్ వేదికగా జరుగుతున్న 3వ అనధికార వన్డేలో సౌతాఫ్రికా-A ఓపెనర్లు ప్రిటోరియస్(123), మునుస్వామి(107)సెంచరీలతో రాణించారు. దీంతో ప్రోటీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. భారత్-A బౌలర్లలో ఖలీల్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ సేన విజయ లక్ష్యం 326. అంతకుముందు 2 మ్యాచుల్లోనూ భారత్-A గెలిచిన సంగతి తెలిసిందే.