మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతన్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు, నీటి శాతం పెరుగుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. మధుమేహం, ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే మంచిది.