TG: మావోయిస్టుల అణచివేతే తమ లక్ష్యమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తుపాకులతో సాధించేదేమీ లేదన్నారు. నక్సలిజం అంతరించిందని పౌరహక్కుల నేతలే చెబుతున్నారని తెలిపారు. యువతను అర్బన్ మావోలు రెచ్చగొడుతున్నారని.. సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తే తానేమీ భయపడనని స్పష్టం చేశారు. TG ప్రభుత్వంలో అర్బన్ మావోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యమయ్యారని చెప్పారు.