TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నాయకులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉప ఎన్నిక ఫలితం, పార్టీ బలోపేతంపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఓటమికి గల కారణలపై పార్టీ నేతల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తున్నారు.