AP: మద్యం కుంభకోణంలో కీలక పరిణామం జరిగింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మోహిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.