WGL: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు గ్రామ స్మశానవాటికలో మౌలిక వసతుల కల్పనకు ₹18 లక్షలతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు అవసరమైన ప్రతి చోట సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని, విలీన గ్రామాల అభివృద్ధికి, ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలు విని పరిష్కరించడం తన బాధ్యత అన్నారు.