TG: ఇందిరమ్మ చీరలను పట్టణాల్లో ఇవ్వడం లేదని కొందరు తప్పుదారి పట్టిస్తారని, వారి మాటలను నమ్మకండని సీఎం రేవంత్ తెలిపారు. మహిళా మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులంతా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ చీరలకు బ్రాండ్ అంబాసిడర్లుగా అధికారులే ఉండాలని చెప్పారు.