ఢిల్లీ వేదికగా రేపు కొలంటో సెక్యూరిటీ కాంక్లేవ్(CSC) 7వ జాతీయ భద్రతా సలహాదారుల(NSAs) సమావేశం జరగనుంది. భారత NSA అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సభ్య దేశాలు లంక, మాల్దీవ్స్ భద్రతా సలహాదారులు, ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇందులో అతిథిగా మలేషియా కూడా పాల్గొననుంది. హిందూ మహా సముద్రం ప్రాంతంలో ప్రాంతీయ భద్రత కోసం 2011లో CSC ఏర్పాటైంది.