AP: పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారీ బాబా తనను బంగారూ అని పిలిచినట్లు అనిపిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన మధ్యలోనే ఉంటారని అన్నారు. సత్యసాయి శతజయంతి వేడుకలకు మంత్రి లోకేష్ హాజరై మాట్లాడారు. ‘సత్యసాయి చూపించిన మార్గం అందరినీ ప్రేమించు.. ఎప్పటికీ సహాయం చేయి.. ఎవరినీ బాధించకు’ అని లోకేష్ కొనియాడారు.