SRD: కంగ్టి మండలం బాన్సువాడ పాఠశాలలో నిర్మించిన హ్యాండ్ వాష్ ప్లాట్ ఫామ్లో కుళాయిలు లేవు. దీనికి నీటి సరఫరా లేక విద్యార్థులు మధ్యాహ్న భోజనం వేళ చేతులు కడుక్కునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు ఎదురుగా ఉన్న పబ్లిక్ హ్యాండ్ పంప్ వద్ద చేతులు కడుక్కుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. అధికారులు స్పందించి కుళాయిలు బిగించి నీటి సరఫరా అందించాలన్నారు.