TG: ఇందిరాగాంధీ స్పూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నామని CM రేవంత్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని గత పాలకులు ఆశ చూపించి అడియాశలు చేశారని ఆరోపించారు. తాము మాత్రం ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.