బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులోని ఫైబర్, పోషకాలు, ప్రొటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొందరు రాత్రిపూట భోజనం బదులు ఓట్స్ తింటారు. ఇలా చేస్తే జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్, మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటివాటికి దారితీస్తుందని, కావాలంటే రా.7PM లోపే తీసుకోవాలని సూచిస్తున్నారు.