AP: ప్రభుత్వాల కంటే సత్యసాయి వేగంగా స్పందించేవారని, సాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు తెలిపారు. 1,600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించాని, 102 విద్యాలయాలు నెలకొల్పి.. ఎన్నో వైద్యాలయాలను స్థాపించారని పేర్కొన్నారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్టు సేవలందిస్తోందని, ట్రస్టుకు 7లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని గుర్తుచేశారు.