AP: పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. పవిత్రభూమి పుట్టపర్తిలో మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములని, సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. సాయి భౌతికంగా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయ జీవించారని కొనియాడారు.