MNCL: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు బుధవారం జన్నారం మండలంలోని తపాలాపూర్, చింతగూడ, కలమడుగు గ్రామాలలో ప్రజలకు వారు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.