AP: ప్రజలను జడ్జ్ చేయొద్దని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పారని క్రికెట్ దిగ్గజం సచిన్ అన్నారు. ‘2011 ప్రపంచకప్లో నేను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి. అప్పుడు బెంగళూరులో ఉన్నాం. సత్యసాయి ఫోన్ చేసి పుస్తకం పంపారు. అది నాలో స్ఫూర్తిని నింపింది. మేం ఆ ఏడాది ట్రోఫీ కూడా గెలుచుకున్నాం. అది నాకు గోల్డెన్ మూముంట్’ అని సచిన్ తెలిపారు.