WGL: వర్ధన్నపేట పట్టణంలోని రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై ఇవాళ జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. సహకార శాఖ అధికారి నీరజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు అధిక ఆదాయం అందించి, వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని సంధ్యారాణి పేర్కొన్నారు.