AP: సేవ, ప్రేమకు సత్యసాయి బాబా ప్రతిరూపమపని సీఎం చంద్రబాబు కొనియాడారు. విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమం సత్యసాయి మార్గమని, మానవసేవే మాధవసేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని పేర్కొన్నారు. భూమిపై మనకు తెలిసిన.. మనం చూసిన దైవస్వరూపం సత్యసాయి అని చెప్పారు. ప్రపంచమంతా సత్యసాయి ప్రేమను పంచారని, విదేశాలకు వెళ్తే చాలామంది సత్యసాయి గురించి చెప్పేవారని గుర్తుచేశారు.