కృష్ణా: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రంథాలయంలో ఇవాళ మాజీ మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు వివిధ రంగాలకు చెందిన 9మంది మహిళలకు శాలువా కప్పి సన్మానించారు.