AP: సత్యసాయి అత్యంత వెనుకబడిన జిల్లాలో వెలిశారని డిప్యూటీ పీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సత్యసాయి తన జన్మకు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని, సాయి గొప్పదనం గురించి విదేశీయులు చెబుతారు.. విదేశాల్లో సాయి భక్తులను చాలామందిని చూశానని తెలిపారు. సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారని గుర్తుచేశారు. సత్యసాయి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు.