KMM: ముదిగొండ మండలం గంధసిరి సమీపంలోని గుట్టల్లో కొంతమంది గ్రామస్థులకు పులి కనిపిచింది అనే వదంతులను నమ్మొద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. పులి కనిపించిందని ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రదేశంలో సంచరించింది నక్క మాత్రమే పులి కాదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.