పిల్లల పట్ల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణ పేరుతో ఎక్కువగా తిట్టడం, ఇతరులతో పోల్చడం, నలుగురిలో తిట్టడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బ తినడంతోపాటు వారిలో అభద్రతా భావం పెరుగుతుంది. వారి నైపుణ్యాలను గుర్తించి లక్ష్యాలను నిర్ధేశించాలి. వారికి మంచి, చెడులను అర్థమయ్యేలా చెప్పాలి. వారితో ఫ్రెండ్లీగా ఉండాలి.