VZM: గజపతినగరం శాఖ గ్రంథాలయంలో బుధవారం టీడీపీ మండల అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయ అధికారి యజ్జల స్వప్నకు అందజేశారు. ఈ పుస్తకాలను పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పుస్తకాలు అందజేసినందుకు మాజీ ఎంపీపీకు ధన్యవాదాలు తెలియజేశారు.