KNR: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులందరికీ చీరలు అందేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇది మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న కానుక అన్నారు.