KNR: 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కరీంనగర్లో బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య హాజరై సహకార సంఘాలలో రైతులు సభ్యత్వం తీసుకోవాలన్నారు. సహకార వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.