WGL: పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని గౌడ సంఘ భూమిలో ఉన్న 18 తాటి చెట్లను అక్రమంగా నరికేసిన ఘటనపై గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇవాళ అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణికి వినతిపత్రం అందజేస్తూ నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రావూరు RDO, ఎక్సైజ్ సూపరిండెంట్లకు కూడా ఫిర్యాదు సమర్పించారు.