SS: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రశాంతి నిలయంలోని బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. మహాసమాధి వద్ద వారు కొద్దిసేపు నివాళులర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.