ప్రకాశం: విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కైపు వెంకటకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలపర్చే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు.