ADB: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఇన్ఛార్జ్ ఐటీడీఎ పీఓ యువరాజ్ మర్మట్ సూచించారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని హాసనాపూర్ phc ని సందర్శించారు. రికార్డులను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానిక ఆశ్రమ పాటశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డెన్‌కు పలు సూచనలు చేశారు.