ADB: ఉమ్మడి జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ బాలికల ఎంపిక పోటీలు ఈ నెల 21న సిర్పూర్ (టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించనున్నారు. క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరై, ప్రిన్సిపల్ లావణ్యకు రిపోర్ట్ చేయాలని జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గురువేందర్ తెలిపారు.